health telugu-news

మీ అమ్మకు ఈ టెస్టులు తప్పకుండా చేయించండి!

జననం నీవే…గమనం నీవే….సమస్తం నీవే…కర్తవు నీవే…కర్మవు నీవే…ఈ జగమంతా నీవే. అందుకే భగవంతుడు అన్ని చోట్లా ఉండలేక….ప్రతి ఇంటిలోనూ నిన్ను స్రుష్టించాడు. పదాలు తెలియని పెదవులకు…అమ్రుత వాఖ్యం అమ్మ. అమె చల్లని ఒడిలోనే మొదలైంది ఈ జన్మ. మహిళగా…అమ్మగా నీ త్యాగం ఎప్పటికీ మరువలేమమ్మా. ఈ భూమి మీద మహిళను అద్భుతంగా మలిచాడు దేవుడు. ఓర్పు, సహనం, నేర్పరి ఈ అన్ని గుణాల కలయికనే స్త్రీ. అమ్మ ఒక స్నేహితురాలు, మంచి గైడ్, ఫిలాసఫర్. పుట్టినప్పటి నుంచి ఏండ్లు గడిచే కొద్దీ శారీరకంగా, మానసికంగా ఆమెలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. అంతేకాదు తల్లిగా ఎంతో ఓర్పుతో శక్తితో ప్రవర్తిస్తుంటుంది. అయితే అమ్మకు జీవితాంతం ఆ శక్తి ఉండదు. వయస్సు మీద పడుతున్నా కొద్దీ మోనోపాజ్ దశ ప్రారంభం అవుతుంది. దీంతో మహిళలో అనేక మార్పులు సంభవిస్తుంటాయి. మోనోపాజ్ అంటే స్త్రీలలో సహజంగా జరిగే మార్పు పీరియడ్స్ ఆగిపోవడం. మానసికంగా, ఫిజికల్ గా అనేక మార్పులు జరుగుతుంటాయి. ఈ పరిణామాలన్నీ కూడా మహిళల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతుంటాయి.

మోనేపాజ్ దశలో స్త్రీలలో ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజన్ అనే హార్మోన్స్ ఉత్పత్తి అనేది క్రమంగా తగ్గిపోతుంది. దీంతో స్త్రీలు మానసికంగా, శారీరక సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. నిద్రలేమి, చికాకు, కోపం వంటి లక్షణాలు ముఖ్యంగా కనిపిస్తాయి. ఈ లక్షణాలతోపాటు కొన్ని శరీరంలో కొన్ని మార్పులు జరుగుతుంటాయి. మోనోపాజ్ దశకు చేరుకున్న మహిళలలకు అంటే దాదాపు 40ఏళ్లలో ఈ మోనోపాజ్ దశ ప్రారంభం అవుతుంది. ముఖ్యం ఉపిరితిత్తులు సరిగ్గా పనిచేయకపోవడం, గుండె సంబంధిత వ్యాధులు, కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ మదర్స్ డే సందర్భంగా ముందుగా మీరు తల్లికి కొన్ని మెడికల్ చెకప్స్ చేయించండి. సమస్యలు పెద్దవిగా మారకుండా….మెడికల్ టెస్టులతో నివారించుకుందాం. మరి మెడికల్ టెస్టుల వివరాలు తెలుసుకుందాం.

మామోగ్రామ్…..
ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మహిళలు ఎదర్కొంటున్న సమస్య బ్రెస్ట్ క్యాన్సర్. ఈ మహమ్మరి వల్ల ఎంతో మంది తల్లలు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. 40 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ తప్పనిసరిగా మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలి. మోనోపాజ్ దశ దాటిన తర్వాత ఈ పరీక్ష ప్రతి ఏడాది చేయించుకుంటే మంచిది.

బోన్ డెన్సిటి స్కాన్….
ఈ మధ్య కాలంలో చాలా మంది మహిళలు బోన్ డెన్సిటి స్కాన్ సమస్యతో బాధపడుతున్నారు. మోనోపాజ్ దశ తర్వాత ఎముకల్లో కాల్షియం తగ్గిపోతుంది. దీంతో ఓస్టిరియోపోసిస్ లాంటి సమస్యలు తలెత్తతుంటాయి. తక్కువ బరువున్న మహిళలు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వైద్యులను సంప్రదించాలి. ఆల్కహాల, స్మోక్ వంటి వాటికి దూరంగా ఉండాలి. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లవుతుంది.

కంటి పరీక్షలు..
వయస్సు మీద పడుతున్నా కొద్దీ ముఖ్యంగా కంటి సమస్యలు ఎదుర్కొవల్సి వస్తుంది. మమోపియా, ప్రెస్బియోపియా, గ్లూకోమా, కాంటరాక్ట్ లాంటి సమస్యలు మోనోపాజ్ దశలో ఎక్కువగా వస్తుంటాయి. షుగర్ తో బాధపడతున్న వారిలో ఈ సమస్యలు తొందరగా కనిపిస్తాయి. కాబట్టి మోనోపాజ్ దశకు చేరుకోగానే వీలైనంత తొందరగా పరీక్షలు చేసుకోవడం ఉత్తమం.

దంత పరీక్ష….

ఓరల్ కాన్సర్ అరికట్టాలంటే దంత పరీక్ష అవసరం. ఓరల్ క్యాన్సర్ అనేది చాలా సాధారణమైంది. ప్రారంభ దశలోనే గుర్తిస్తే…తొందరగా తగ్గించుకోవచ్చు. డెంటల్ టెస్టు ద్వారా దంతాక్షయం, చిగుళ్ల ఇన్ఫెక్షన్ వంటి వ్యాధులను గుర్తించవచ్చు. అంతేకాదు తీపిపదార్థాలు, స్మోకింగ్, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునేవారు డెంటల్ టెస్ట్ చేయించుకోవడం బెస్ట్

సర్వైకల్ క్యాన్సర్….
ఇది చాలా ప్రమాదకరమైన మహమ్మారి. స్త్రీలు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. 40 ఏండ్లు దాటిన తర్వాత తప్పనిసరిగా ఈ సర్వైకల్ క్యాన్సర్ టెస్ట్ చేయించుకోవాలి. ఈ వ్యాధి ముదిరినట్లయితే స్కర్విక్స్ ను తొలగించాల్సి వస్తుంది. కాబట్టి ప్రారంభంలో గుర్తించి నయం చేసుకోవడం మంచిది.

Leave a Reply

%d bloggers like this: