news telugu-news

పవన్ కళ్యాణ్ వెనుక టీఆర్ఎస్ మంత్రి…ఎవరో తెలిస్తే షాక్ అవుతారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో తనదైన మార్కు రాజకీయాలకు తెరలేపారు. గతంలో జనసేన పార్టీ కేవలం ప్రజాదరణనే నమ్ముకొని ముందుకు వెళ్లగా, ఇఫ్పుడు రాజకీయ ఎత్తుగడలు కూడా వేయాలని తీర్మానించుకుంది. ఇందులో భాగమే ఇటీవలి పరిణామాలు, 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని మూసివేస్తారని ప్రచారం జరిగింది. దాన్ని తిప్పిగొడుతూ పవన్ కళ్యాణ్ పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయితీ ఎన్నికల్లో కూడా బరిలో నిలబెట్టి తమ ఓటు బ్యాంకు ఎంతుందో అంచనాకు వచ్చారు. అయితే పవన్ అటు బీజేపీతో వ్యూహాత్మక పొత్తు పెట్టుకొని రాజకీయ ఎత్తుగడలకు తెర లేపారు. ఓ వైపు జగన్ అత్యంత శక్తివంతుడిగా కనిపిస్తుండగా, అతడిని ఎదుర్కొనేందుకు వపన్ కు మరో శక్తి తోడు కావాల్సి వచ్చింది. కేంద్రంలోని బీజేపీతో గతంలో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీ అధినేత ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో బీజేపీ స్టాండ్ తో నెమ్మదిగా పక్కకు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగమే, తెలంగాణలో బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారనే మాట వినిపిస్తోంది. అంతేకాదు తెలంగాణలో బీజేపీ తమ పార్టీని గుర్తించడం లేదని, పార్టీ అధినేత పవన్ కళ్యాణే ఆరోపణలు గుప్పించడం గమనార్హం. అంతేకాదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి పీవీ వాణికి మద్దతు ఇచ్చింది. అంతేకాదు నాగార్జున సాగర్ ఎన్నికల్లో పోటీ కూడా చేస్తామని పరోక్షంగా తెలిపింది. దీంతో పవన్ రాజకీయం స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ టీఆర్ఎస్ పార్టీతో సన్నిహితంగా మెలగడం వెనుక ఇద్దరు టీఆర్ఎస్ మంత్రుల ప్రభావం ఉందనే వాదన వినిపిస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఫైనాన్షియర్ గా ఉన్నారు. అంతేకాదు పవన్ సన్నిహితుడు నిర్మాత బండ్లగణేష్ కు ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ వాడిన పోలీసు జీపు కూడా ఎర్రబెల్లి ప్రదీప్ రావుదే కావడం విశేషం. అలాగే ఎర్రబెల్లి దయాకర్ రావుతో కూడా పవన్ కళ్యాణ్ కు మంచి రిలేషన్ ఉంది. అంతేకాదు కరీంనగర్ కు చెందిన మరో మంత్రి గంగుల కమలాకర్ సైతం పవన్ కళ్యాణ్ టీఆర్ఎస్ కు సపోర్ట్ చేయించడం వెనుక చక్రం తిప్పారనే వార్తలు వస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బలంగా ఉన్న కాపునాడుతో గంగుల కమలాకర్ కు సత్సంబంధాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తో గంగులు కాంటాక్ట్ అయ్యాడనే సమాచారం ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి ఓ సామాజిక వర్గాన్ని ప్రభావితం చేసేందుకు పవన్ కళ్యాణ్ కూడా భవిష్యత్తులో తోడ్పడతాడని, అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంచార్జీగా ఉన్న గంగుల జనసేనతో కాంటాక్ట్ అయి పవన్ తో టీఆర్ఎస్ కు మద్దతు దక్కేలా చక్రం తిప్పారనే వార్తలు వస్తున్నాయి.

Leave a Reply

%d bloggers like this: